ఈ రిఫరల్ ప్రోగ్రామ్ నిబంధనలు (“నిబంధనలు”) అనేవి రెఫరల్‌ను ప్రారంభించే అర్హత గల Roblox Plus సబ్స్క్రైబర్లకు (ప్రతి ఒక్కరినీ “రెఫరర్”అంటారు) మరియు అలాంటి రిఫరల్‌ను స్వీకరించే ఆహ్వానిత వ్యక్తులకు (ప్రతి ఒక్కరినీ “రెఫరీ”అంటారు)వర్తిస్తాయి. రెఫరర్లు మరియు రెఫరీలను సమిష్టిగా "పార్టిసిపెంట్లు" అని పిలుస్తారు.
ఈ నిబంధనల ప్రయోజనాల కోసం, “రెఫరల్ ప్రోగ్రామ్అనేది Roblox ద్వారా నిర్వహించబడే ఒక ప్రచార కార్యక్రమం. ఇది అర్హతగల రెఫరర్లకు రెఫరల్ లింక్‌లు పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుంది మరియు Roblox నిర్ధారించిన విధంగా, ఇక్కడ పేర్కొన్న షరతులు నెరవేర్చిన తర్వాత అర్హతగల రెఫరీలు బహుమతులు సంపాదించే అవకాశం కల్పిస్తుంది. రెఫరల్ ప్రోగ్రామ్ అనేది Roblox పూర్తి అభీష్టానుసారం మార్పులకు లోబడి ఉంటుంది.
- అర్హత. రెఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి, ప్రతి పార్టిసిపెంట్ ఒక మంచి స్థితిలో ఉన్న Roblox అకౌంట్ కలిగి ఉండాలి. రెఫరర్ తప్పనిసరిగా యాక్టివ్, పెయిడ్ సహిత Roblox Plus సబ్స్క్రిప్షన్ కలిగి ఉండాలి. రెఫరర్ తప్పనిసరిగా Roblox Plusకు మొదటి-సారి సబ్‌స్క్రైబర్‌గా ఉండాలి. Roblox Plus యాక్టివ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేసిన లేదా గతంలో ఎప్పుడైనా కొనుగోలు చేసిన వ్యక్తులెవరూ రెఫరీగా పాల్గొనడానికి మరియు బహుమతి పొందడానికి అర్హులు కారు. ఏ సమయంలోనైనా సరే, భాగస్వామ్యాన్ని పరిమితం చేసే లేదా ఈ అర్హతా ప్రమాణాలు సవరించే హక్కు Roblox కలిగి ఉంది.
- రెఫరల్ యంత్రాంగాలు. రెఫరల్ ప్రారంభించడానికి, రెఫరర్ తప్పనిసరిగా Roblox ద్వారా రూపొందించిన వారి ప్రత్యేకమైన, వ్యక్తిగత రెఫరల్ లింక్ లేదా కోడ్ షేర్ చేయాలి. రెఫరీ ఆ నిర్దిష్ట రిఫరల్ లింక్ మీద క్లిక్ చేసి నమోదును ప్రారంభించి, ప్రోగ్రామ్ కోసం Roblox నిర్దేశించిన కొనుగోలు అవసరాలను విజయవంతంగా పూర్తి చేస్తేనే, రెఫరల్ సంభావ్య రివార్డులకు అర్హత పొందుతారు. రెఫరీకి ఒకటి కంటే ఎక్కువ రెఫరల్ లింకులు అందితే, చివరి కన్వర్షన్ మరియు చెక్అవుట్ ఈవెంట్ సమయంలో రిజిస్టర్ చేయబడిన లింక్ యజమానికి మాత్రమే ప్రమోషనల్ క్రెడిట్ ఇవ్వబడుతుంది.
- అర్హమైన ట్రాన్సాక్షన్లు. ప్రారంభ ప్రమోషనల్ ఉచిత ట్రయల్ అందిస్తే, దాని ద్వారా కూడా Roblox Plus సబ్స్క్రిప్షన్ కోసం రెఫరీ నమోదు చేసుకోవచ్చు; అయితే, రెఫరీ తన మొదటి చెల్లింపు సబ్స్క్రిప్షన్ సైకిల్ చెల్లింపును విజయవంతంగా పూర్తి చేసేంత వరకు, ఏ పార్టిసిపెంట్‌కు కూడా రెఫరల్ రివార్డ్ అందదు లేదా జారీ చేయబడదు. అంతేకాకుండా, బహుమతి స్వీకరించడానికి, అది ప్రాసెస్ చేయబడి, జారీ చేయబడే సమయంలో పాల్గొనే ఇద్దరూ తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉన్న, పెయిడ్ Roblox సబ్స్క్రిప్షన్ కలిగి ఉండాలి. చెల్లింపు ప్రక్రియకు ముందు తమ సబ్స్క్రిప్షన్ స్థితిని యాక్టివ్‌గా ఉంచుకోవడంలో ఒక పార్టిసిపెంట్ విఫలమైనా సరే, ఆ రివార్డును ఇద్దరు పార్టిసిపెంట్లు కోల్పోతారు.
- ప్రమోషనల్ రివార్డులు. రెఫరల్ రివార్డులు అనేవి ప్రచార సంబంధిత ప్రోత్సాహకాలు. వీటికి నగదు లేదా సాధారణ కరెన్సీ విలువ ఉండదు. రెఫరల్ ఆఫర్ సమయంలో వీటిని Roblox నిర్ణయించి, వెల్లడిస్తుంది. అర్హత కలిగిన సబ్స్క్రిప్షన్ కొనుగోలును రెఫరీ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, యాక్టివ్ సబ్స్క్రిప్షన్ షరతుకు లోబడి, సంబంధిత రివార్డ్ అనేది ఇద్దరు పార్టిసిపెంట్ల అకౌంట్లలోనూ జమ చేయబడుతుంది. ఒక రెఫరీ తన అకౌంట్ జీవితకాలంలో ఒక (1) ప్రమోషనల్ రిఫరల్ రివార్డ్‌కు మాత్రమే పరిమితంగా ఉంటారు. చట్టం ప్రకారం అవసరమైన సందర్భాలు మినహా, రివార్డులు బదిలీ చేయబడవు, వాపసు చేయబడవు, మార్పిడి చేయబడవు మరియు అధికారిక ప్లాట్‌ఫారమ్ ఫీచర్ల వెలుపల రీడీమ్ చేయబడవు లేదా వర్తకం చేయబడవు.
- తప్పనిసరి ప్రజా వెల్లడింపులు. రెఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా, U.S.తో సహా వర్తించే అన్ని వినియోగదారు రక్షణ చట్టాలు మరియు ఆమోద మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటానని ప్రతి రెఫరర్ అంగీకరిస్తారు. ఆమోదాలు మరియు వినియోగదారుల సాక్ష్యాల వినియోగానికి సంబంధించిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ మార్గదర్శకాలు. రెఫరల్ లింక్ షేర్ చేసేటప్పుడు, ఆ రెఫరల్‌కు సంబంధించిన ఆర్థిక ప్రోత్సాహకాన్ని మీరు స్పష్టంగా, అందరికీ కనిపించేలా మరియు ఆ లింక్ దాని పక్కనే ఉండేలా తెలియజేయాలి.
- నిషేధిత ప్రవర్తన మరియు ఎన్ఫోర్స్మెంట్. స్వీయ-రెఫరల్ స్కీమ్‌లలో పాల్గొనడం, రివార్డులు పొందేందుకు ప్రత్యామ్నాయ అకౌంట్లు క్రియేట్ చేయడం లేదా రెఫరల్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగ, మోసపూరిత లేదా వంచనతో కూడిన పద్ధతుల్లో ఉపయోగించడం నుండి పార్టిసిపెంట్లు నిషేధించబడ్డారు. ఆటోమేటెడ్ పద్ధతులు, స్క్రిప్ట్‌లు, బాట్లు, చెల్లింపు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, పబ్లిక్ కూపన్ లేదా డీల్ అగ్రిగేషన్ వెబ్సైట్లు లేదా అయాచిత సామూహిక మెసేజ్‌లు ద్వారా రెఫరల్ లింక్‌లు పంపిణీ చేయడం నిషేధించబడింది. మోసం, ఆటోమేటెడ్ మానిప్యులేషన్, బ్యాంక్ ఛార్జ్‌బ్యాక్‌లు లేదా వర్తించే ప్లాట్‌ఫారమ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అనుమానం ఉన్న సందర్భాల్లో, రెఫరల్లను అనర్హులుగా ప్రకటించడానికి, చెల్లింపులు నిలిపివేయడానికి లేదా ఆలస్యం చేయడానికి, లేదా రివార్డులు మరియు అకౌంట్ యాక్సెస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా రద్దు చేయడానికి Robloxకు హక్కు ఉంది.
- డేటా గోప్యత. పార్టిసిపెంట్లు మధ్య ఉండే వ్యక్తిగత, గుర్తింపును వెల్లడించే లేదా వివరణాత్మక లావాదేవీ సమాచారాన్ని Roblox వెల్లడించదు. రెఫరల్ లింక్ ద్వారా విజయవంతంగా మార్పిడి జరగడం లేదా రివార్డ్ జారీ చేయబడడం లాంటి సాధారణ సమాచారం షేర్ చేసే అవకాశం ఉందని పార్టిసిపెంట్లు అంగీకరిస్తున్నారు.
- పన్ను బాధ్యతలు. ప్రచార బహుమతులు పొందడం, కలిగి ఉండడం లేదా ఉపయోగించడం వల్ల తలెత్తే ఏవైనా వ్యక్తిగత ఫెడరల్, రాష్ట్ర, స్థానిక లేదా అంతర్జాతీయ పన్ను బాధ్యతలు, సుంకాలు లేదా ఆర్థిక నివేదిక సమర్పణ బాధ్యతలను అంచనా వేయడానికి, నివేదించడానికి మరియు చెల్లించడానికి ప్రతి పార్టిసిపెంట్ వ్యక్తిగతంగా మరియు ప్రత్యేకంగా బాధ్యులుగా ఉంటారు.
- అదనపు నిబంధనలు మరియు సవరణ. ఈ నిబంధనలనేవి Roblox వినియోగ నిబంధనలు, Roblox గోప్యతా విధానం, Roblox సబ్స్క్రిప్షన్ నిబంధనలు, మరియు కమ్యూనిటీ ప్రమాణాలు తో సహా మీ అకౌంట్‌కు వర్తించే ఇతర Roblox ఒప్పందాలు, విధానాలు లేదా నియమాలకు అదనంగా ఉంటాయే తప్ప, వాటిని భర్తీ చేయవు. రివార్డ్ విలువలు మార్చడం, యూజర్ పరిమితులు జోడించడం లేదా ప్రోగ్రామ్ షరతులు సవరించడంతో సహా, ఏదైనా కారణంతో మరియు ముందస్తు నోటీసు లేకుండా, ఎప్పుడైనా రెఫరల్ ప్రోగ్రామ్ లేదా ఈ నిబంధనలు సవరించడానికి, నిలిపివేయడానికి లేదా రద్దు చేయడానికి Robloxకు హక్కు ఉంది.