అమలు తేదీ: ఏప్రిల్ 30, 2026
ఈ Roblox సబ్స్క్రిప్షన్ నిబంధనలు (“సబ్స్క్రిప్షన్ నిబంధనలు”) అనేవి Roblox కార్పొరేషన్ మరియు దాని అనుబంధ సంస్థలు (“Roblox”, “మేము” లేదా “మాకు”) అందించే సబ్స్క్రిప్షన్ ఉత్పత్తులు (“సబ్స్క్రిప్షన్”)కి మీ యాక్సెస్ మరియు వినియోగాన్ని నియంత్రిస్తాయి.
ఈ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడం ద్వారా, ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనలను అర్థం చేసుకున్నారని, అంగీకరిస్తున్నారని మరియు ఆమోదిస్తున్నారని మీరు సూచిస్తున్నారు. ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనలనేవి మీకు (“యూజర్”, “మీ” లేదా “మీ యొక్క”) మరియు Roblox మధ్య ఒక చట్టపరమైన బంధం కోసం ఒప్పందంగా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ నిబంధనలలో దేనినీ మీరు అంగీకరించకపోతే, సబ్‌స్క్రిప్షన్‌ను మీరు యాక్సెస్ చేయలేరు లేదా ఉపయోగించలేరు.
ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనలనేవి Roblox వినియోగ నిబంధనలు (“వినియోగ నిబంధనలు”) అనుబంధంగా ఉంటాయి. ఇవి సూచన ద్వారా ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనల్లో చేర్చబడ్డాయి. ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనలు మరియు వినియోగ నిబంధనల మధ్య ఏదైనా వైరుధ్యం ఉంటే, ఈ సబ్స్క్రిప్షన్ నిబంధననేవి సబ్స్క్రిప్షన్ యాక్సెస్ మరియు ఉపయోగం గురించి నియంత్రిస్తాయి. పెద్ద అక్షరాలతో ఉండే పదాలను ఇక్కడ నిర్వచించనప్పటికీ, వాటికోసం వినియోగ నిబంధనల్లో ఇచ్చిన అర్థమే వాటికి కూడా వర్తిస్తుంది.
జనరల్
అర్హత: ఈ సబ్స్క్రిప్షన్ అనేది వ్యక్తుల వ్యక్తిగత, వాణిజ్యేతర ఉపయోగం కోసం మాత్రమే వారికి అందించబడుతుంది. మేము సబ్‌స్క్రిప్షన్‌ను ఏ దేశాల్లోని నివాసితుల కోసం అందిస్తామో వాళ్లు మాత్రమే ఆ సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయడానికి అర్హులు.
వయసు పరిమితి: సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయడానికి మీకు 18 సంవత్సరాలు (లేదా మీరు నివసించే దేశంలో చట్టబద్ధమైన వయస్సు) ఉండాలి. మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారైతే (లేదా మీరు నివసించే దేశంలో చట్టబద్ధమైన వయస్సు వ్యక్తి అయితే), మీ కోసం సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయడానికి మీకు మీ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అవసరం.
సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు
ప్రతి సబ్స్క్రిప్షన్ మరియు దాని సంబంధిత ప్రయోజనాల వివరణను మీరు మా వెబ్సైట్లో చూడవచ్చు. ఏ సమయంలోనైనా మరియు ఏ కారణం చేతనైనా సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను తన స్వీయ అభీష్టానుసారం అప్డేట్ చేసే హక్కును Roblox కలిగి ఉంది. కాలానుగుణంగా, బోనస్ ప్రయోజనం లాంటి అదనపు ప్రయోజనాలను కూడా Roblox అందించవచ్చు. ఇలాంటి బోనస్ ప్రయోజనాలకు హామీ ఉండదు, వినియోగదారులు అందరి కోసం అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రతినెలా మారవచ్చు లేదా పూర్తిగా Roblox అభీష్టానుసారం నిలిపివేయబడవచ్చు.సబ్స్క్రిప్షన్ ఫీజు మరియు పేమెంట్
ఆటోమేటిక్ రెన్యూవల్: ప్రతి బిల్లింగ్ వ్యవధి ప్రారంభంలో మీ సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రెన్యూవల్ చేయబడుతుంది మరియు మీరు దానిని క్యాన్సిల్ చేసే వరకు అది నిరవధికంగా కొనసాగుతుంది.
సబ్స్క్రిప్షన్ ఫీజులు: మీరు ఒక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేసినప్పుడు ఎంచుకున్న సబ్స్క్రిప్షన్ కోసం మీరు ఫీజులు (“సబ్స్క్రిప్షన్ ఫీజులు”) చెల్లించాలి. వర్తించే చట్టం ద్వారా అవసరమైతే లేదా కొనుగోలు సమయంలో సూచించి ఉంటే తప్ప, సబ్స్క్రిప్షన్ ఫీజులనేవి వర్తించే ఏవైనా పన్నులు మినహాయించబడి ఉంటాయి. వర్తించే చట్టం ప్రకారం మాకు అవసరనప్పుడు, సబ్స్క్రిప్షన్ కోసం మేము మీ నుండి పన్నులు వసూలు చేస్తాము మరియు సేకరిస్తాము. మీరు సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేసినప్పుడు మీ అధికార పరిధి మరియు మీ బ్యాంకింగ్ ప్రొవైడర్ ఆధారంగా మీకు అదనపు ఫీజులు (ఉదా., విదేశీ లావాదేవీల రుసుము) విధించబడవచ్చు. దేశం లేదా ప్రాంతం బట్టి సబ్స్క్రిప్షన్ ఫీజులు మారవచ్చు మరియు మీరు మీ నివాస దేశం మార్చితే మీ సబ్స్క్రిప్షన్ ఫీజును అప్డేట్ చేసే హక్కు మాకు ఉంది.
మీకు సహేతుకమైన నోటీసు ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే, సబ్స్క్రిప్షన్ ఫీజులు మార్చడానికి లేదా కొత్త ఫీజులు జోడించడానికి మాకు హక్కు ఉంది. ప్రత్యేకించి పేర్కొంటే తప్ప, సబ్స్క్రిప్షన్ ఫీజుల్లో మార్పునేవి మీ తదుపరి బిల్లింగ్ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ధర మార్పు కోసం మీరు అంగీకరించకపోతే, ధర మార్పు అమలులోకి రాకముందే మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేయాలి. సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించడం కొనసాగించడం ద్వారా, కొత్త రికరింగ్ సబ్స్క్రిప్షన్ ఫీజును అంగీకరిస్తున్నట్లు మీరు సూచిస్తున్నారు.
పేమెంట్: మీరు సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేసే సమయంలో, చెల్లింపు పద్ధతి ఎంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అడుగుతారు. ఈ చెల్లింపు సమాచారాన్ని Robloxకి అందించడం ద్వారా, మీరు ఎంచుకున్న చెల్లింపు పద్ధతిని ఉపయోగించడానికి అధికారం ఉన్న వయోజనులని మరియు మీరు అందించే ఏదైనా చెల్లింపు సమాచారం ఖచ్చితమైనదని మీరు సూచిస్తున్నారు. సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయడం ద్వారా, సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లింపు కోసం మీ చెల్లింపు సమాచారం సేకరించి, ఉపయోగించడానికి మరియు మీరు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దుచేసే వరకు ఎంచుకున్న చెల్లింపు పద్ధతికి ఆటోమేటిక్‌గా సబ్స్క్రిప్షన్ ఫీజును పునరావృత ప్రాతిపదికన వసూలు చేయడానికి మీరు Roblox లేదా నియమించిన మూడవ పక్షం చెల్లింపు ప్రదాతకు అధికారం ఇస్తున్నారు.
రీఫండ్స్, బదిలీలు మరియు విత్‌డ్రాయల్స్: సబ్స్క్రిప్షన్లు అనేవి నాన్-రీఫండబుల్ మరియు నాన్-రీఫండబుల్‌గా ఉంటాయి. చట్టం అనుమతించిన గరిష్ట పరిధి వరకు, తిరిగి చెల్లింపుకు అర్హత కల్పించే ఏవైనా చట్టబద్ధమైన హక్కులను వదులుకోవడానికి, ఉదాహరణకు, మీ ప్రారంభ కొనుగోలు తర్వాత అందుబాటులో ఉండే ఉపసంహరణ హక్కు లేదా "కూలింగ్ ఆఫ్" వ్యవధి (ఉదాహరణకు, యూరోపియన్ యూనియన్‌లోని వారికి 14 రోజుల వ్యవధి)ని మీరు అంగీకరిస్తున్నారు. వదులుకోలేని మేరకు, అటువంటి హక్కులు వర్తిస్తాయి మరియు మీరు క్రింద ఉన్న రద్దు సమాచారం ఉపయోగించి, ఉపసంహరించుకోవచ్చు.
రద్దు చేయడం
మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసిన ప్లాట్ఫామ్లో ఇక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించడం ద్వారా, మీరు ఎప్పుడైనా మీ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీ సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రెన్యూవల్ కాకుండా ఉండటానికి మరియు తదుపరి బిల్లింగ్ వ్యవధికి మీకు సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయబడకుండా ఉండటానికి మీరు మీ తదుపరి బిల్లింగ్ తేదీకి ముందే మీ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేయాలి. మీరు మీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకుంటే, ప్రత్యేకంగా సూచించని పక్షంలో, క్యాన్సిల్ అనేది మీ ప్రస్తుత బిల్లింగ్ వ్యవధి ముగింపులో అమలులోకి వస్తుంది. ఇప్పటికే చెల్లించిన కాలానికి మీ సబ్స్క్రిప్షన్ యాక్సెస్ చేయడం మరియు ఉపయోగించడం మీరు కొనసాగిస్తారు. మీ సబ్స్క్రిప్షన్ ముగిసినప్పుడు, మీరు ఇకపై సబ్స్క్రిప్షన్ లేదా వాటి సంబంధిత ప్రయోజనాలకు యాక్సెస్ కలిగి ఉండరు. ప్రస్తుత సబ్స్క్రిప్షన్ ఫీజు ధర వద్ద సబ్స్క్రిప్షన్ కోసం మీరు మళ్లీ సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు.
రద్దు మరియు సస్పెన్షన్
Roblox తన స్వంత అభీష్టానుసారం మరియు ముందస్తు నోటీసు లేకుండానే, ఎప్పుడైనా సరే, సబ్‌స్క్రిప్షన్‌కు (లేదా దానిలోని ఏదైనా భాగానికి) మీ యాక్సెస్ నిలిపివేయడానికి లేదా ముగించడానికి హక్కు కలిగి ఉంటుంది. సస్పెన్షన్ లేదా రద్దుకు కారణాలు, (i) ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనలు ఉల్లంఘించడం లేదా అతిక్రమించడం; (ii) మీ నుండి అభ్యర్థన; (iii) మీరు చెల్లించాల్సిన ఏవైనా సబ్స్క్రిప్షన్ ఫీజులు చెల్లించకపోవడం; (iv) ఊహించని సాంకేతిక లేదా భద్రతా సమస్యలు లేదా సేవ లేదా సబ్‌స్క్రిప్షన్‌తో సమస్యలు; లేదా (v) చట్ట అమలు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల నుండి చట్టబద్ధమైన అభ్యర్థనలు. కొన్ని సందర్భాల్లో, అభ్యర్థించే హక్కు మీకు ఉంటుంది. అభ్యర్థన ప్రక్రియ ప్రారంభించడానికి Roblox మద్దతు ఫారమ్ ఉపయోగించి, Roblox సపోర్ట్‌ను సంప్రదించండి.
వివాద పరిష్కారం
ముఖ్యమైనది: వినియోగ నిబంధనలు తప్పనిసరి అనధికారిక వివాద పరిష్కారం, మధ్యవర్తిత్వం మరియు క్లాస్-యాక్షన్ మినహాయింపు నిబంధనలు కలిగి ఉంటాయి. మీరు యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తుంటే ఆర్బిట్రేషన్ మరియు క్లాస్-యాక్షన్ మినహాయింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనలు నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించి ఏదైనా వివాదం లేదా దావా అనేది ఉపయోగ నిబంధనల్లోని వివాద పరిష్కార నిబంధనలకు లోబడి ఉంటుంది.
అధీకృత వినియోగం
Roblox లేదా Roblox సర్వీసుల సంబంధిత ఇతర వినియోగదారుల కోసం చట్టవిరుద్ధమైన, తప్పుదారి పట్టించే లేదా మోసపూరితమైన ఏ విధంగానూ సబ్స్క్రిప్షన్ ఉపయోగించకూడదని మీరు అంగీకరిస్తున్నారు.
మీ సబ్స్క్రిప్షన్ భద్రత కోసం మీరే బాధ్యత వహిస్తారని మీరు అర్థం చేసుకున్నారు, గుర్తించారు మరియు అంగీకరిస్తున్నారు. మీ సబ్‌స్క్రిప్షన్‌ను అనధికారికంగా ఉపయోగించారని లేదా ఏదైనా ఇతర భద్రతా ఉల్లంఘన జరిగిందని మీరు విశ్వసించడానికి కారణం ఉంటే (మరియు అభ్యర్థిస్తే ఏదైనా డాక్యుమెంట్ చేయబడిన ఆధారాలు అందించడానికి) వెంటనే Robloxకి తెలియజేయడానికి మీరు అంగీకరిస్తున్నారు. మీ చర్యలు లేదా చర్య తీసుకోవడంలో వైఫల్యం ఫలితంగా, మీకు కలిగే ఏదైనా నష్టానికి, ఉదాహరణకు, మీకు తెలియకుండా లేదా తెలియకుండానే మరొకరు మీ సభ్యత్వాన్ని ఉపయోగించడం వంటి వాటికి Roblox బాధ్యత వహించదు.
మీ వాస్తవ భౌగోళిక స్థానం దాచిపెట్టే లేదా మీ స్థానం గురించి తప్పుడు వివరాలు అందించే ఏదైనా యంత్రాంగం లేదా సాంకేతికత (ఉదాహరణకు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN)) ద్వారా మీరు సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకూడదు.
సబ్స్క్రిప్షన్ నిబంధనలలో మార్పు
ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనలను ఎప్పటికప్పుడు మా స్వంత అభీష్టానుసారం మార్చే హక్కు మాకు ఉంది. ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనలకు మేము మార్పులు చేస్తే, సబ్స్క్రిప్షన్ నిబంధనలు సంబంధిత అత్యంత తాజా వెర్షన్‌ను మేము మా వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము మరియు అమలు తేదీని అప్డేట్ చేస్తాము మరియు అలా చేయడం అవసరమని లేదా సముచితమని మేము భావిస్తే మీకు నోటీసు అందిస్తాము. మార్పులను మీరు ఆమోదించకపోతే మరియు వాటికి అంగీకరించకపోతే, మీరు మీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించడం కొనసాగించడం ద్వారా, మీరు ఏవైనా నవీకరించబడిన సబ్స్క్రిప్షన్ నిబంధనలకు మీ అంగీకారాన్ని సూచిస్తారు.
ఈ సబ్స్క్రిప్షన్ నిబంధనల్లో ఏదికూడా వర్తించే చట్టాన్ని పాటించడం, భౌతిక భద్రతా ప్రమాదాన్ని పరిష్కరించడం లేదా గణనీయమైన ఆర్థిక లేదా భౌతిక సాంకేతిక భారాన్ని నివారించడం వంటి వాటితో సహా, ఏదైనా భూభాగం లేదా ప్రాంతంలో మార్పులు చేయడం లేదా తీసివేయడం, పరిమితం చేయడం, నిర్బంధించడం లేదా సబ్‌స్క్రిప్షన్‌ను నిలిపివేయడం వంటివి Roblox సామర్థ్యాన్ని పరిమితం చేయవు. ఏదైనా భూభాగం లేదా ప్రాంతంలో సబ్స్క్రిప్షన్ లేదా సబ్‌స్క్రిప్షన్‌లో ఏదైనా భాగాన్ని తీసివేయాలని, గణనీయంగా పరిమితం చేయాలని, నిర్బంధించాలని లేదా నిలిపివేయాలని మేము నిర్ణయించుకుంటే, మేము మీకు సహేతుకమైన నోటీసు ఇస్తాము.
నోటీసు
Roblox మీకు అందించే ఏవైనా నోటీసులు ఎలక్ట్రానిక్‌గా చేయబడతాయి (i) మీరు అందించిన చివరి ఇమెయిల్ చిరునామాకు ఇమెయిల్ ద్వారా; లేదా (ii) సర్వీసులలో లేదా సర్వీస్ లోపల నోటీసు పోస్ట్ చేయడం ద్వారా; లేదా (iii) Roblox స్వంత అభీష్టానుసారం సముచితమని భావించే ఏదైనా ఇతర నోటీసు పద్ధతి. మా నుండి నోటీసులు మరియు ఇతర కమ్యూనికేషన్లు కోసం మీ సంప్రదింపు సమాచారంతో సహా ఖచ్చితమైన, ప్రస్తుత మరియు పూర్తి సమాచారాన్ని అందించడానికి మరియు నిర్వహించడానికి మీరు అంగీకరిస్తున్నారు.
సంప్రదింపు
మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, Roblox సపోర్ట్ ఫారమ్ ఉపయోగించి మీరు Roblox సపోర్టుని సంప్రదించవచ్చు.